TG: భద్రాద్రి జిల్లా చర్లలో నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు ప్రజా తీర్పు వన్‌సైడ్ వచ్చింది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మావైపే ఉన్నారు. పాలెంవాగు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. వచ్చే నెల రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం’ అని తెలిపారు.