Perni Fires On Pawan : జనసేనాని పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. కాపులంతా తనకు సపోర్ట్ చేస్తే.. తాను కచ్చితంగా గెలుస్తానంటూ ఇటీవల పవన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. కాపులంతా తనకు సపోర్ట్ చేస్తే.. తాను కచ్చితంగా గెలుస్తానంటూ ఇటీవల పవన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ నాలుకకు నరం ఉండదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అతనికే తెలియదని నాని విమర్శించారు. కాపులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లు కలిస్తే ఈ ప్రభుత్వం మారిపోతుందని పవన్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం ఎందుకు మారాలి? ఎవరి చేతుల్లోకి అధికారం వెళ్ళటానికి మారాలని నాని ప్రశ్నించారు. తన లబ్ది కోసం, ఆనందం, తృప్తి కోసం ప్రజలు ఏమైపోయినా పవన్ కళ్యాణ్ కు పర్వాలేదని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్ నోరు విప్పితే అబద్ధాలని నాని విమర్శించారు. పవన్ నాన్న కాపు, అమ్మ బలిజ అని కొత్తగా చెబుతున్నాడని, రాజకీయం కోసం ఎంతకైనా తెగిస్తాడని నాని విమర్శించారు. ప్రజాసేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే నీకు కులంతో ఏం పని అని నాని ప్రశ్నించారు. ప్రజా నాయకులకు కులంతో పని ఉండదని నాని తేల్చి చెప్పారు.
2024 మార్చి కల్లా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముసుగు బయటపెట్టక తప్పదని నాని అన్నారు. ప్రతి కాపు నాకు ఓటు వేసి ఉంటే నేను ఓడిపోయే వాడిని కాదని పవన్ కళ్యాణ్ అనటం అతని దౌర్భాగ్యం అని నాని అన్నారు. ఒక కులం ఓట్లతో గెలిచే వారు కుల నాయకుడు అవుతాడు, ప్రజా నాయకుడు కాదని.. కమ్మవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు కాపుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని నాని విమర్శలు గుప్పించారు.