సత్యసాయి: గోరంట్ల మండలంలో ఆదివారం రాష్ట్ర మంత్రి సవితమ్మ పర్యటించనున్నారు. ఉదయం వడిగేపల్లి పంచాయతీ పరిధిలో రూ. కోటి వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ఆమె పరిశీలిస్తారు. అనంతరం రెడ్డి చెరువు పల్లి మాజీ సర్పంచ్ నిడిమామిడప్ప కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం నర్సింపల్లిలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరనున్నారు.