SRPT: ఆత్మకూరు (ఎస్) మండలం మక్తా కొత్తగూడెంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో తహసీల్దార్ అమీన్ సింగ్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒక ట్రాక్టరును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ నివేదికను కలెక్టరుకు పంపనున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు.