ప్రముఖ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ తనమీద పెట్టిన కేసులపై తాజాగా స్పందించారు. తాను రోజుకూ 10 నుంచి 15 ట్వీట్లు, పోస్టులు పెడుతుంటానని, ఇప్పటికే తన ‘X’లో వేల ట్వీట్లు పెట్టానన్నారు. తన వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారో తనకు తెలియదన్నారు. ప్రస్తుతం తనకు ఆ పోస్టుల గుర్తించి తెలియదని, ఎప్పుడు ట్వీట్ చేశానో.. అందులో ఏముందో గుర్తు లేదన్నారు. రెండేళ్ల కింద పెట్టిన పోస్టులపై ఇప్పుడు ఫిర్యాదులు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు.