WGL: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్య శారద దేవి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 78 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వారికి న్యాయం చేయాలని సూచించారు.