అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీకి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. అయితే ముంబైలోని ఓ థియేటర్లో మాత్రం ‘పుష్ప 2’ టికెట్ ధర చూసి అందరూ షాక్ అవుతున్నారు. జియో వరల్డ్ డ్రైవ్‌లో ఉన్న పీవీఆర్ మైసన్లో ఏకంగా రూ.3వేలు చూపిస్తోంది. అక్కడకు వెళ్లే ప్రేక్షకుడికి వీఐపీ తరహాలో సౌకర్యాలు ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.