గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నానా హైరానా’ పాట రిలీజైన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటపై సినీ గీత రచయిత రామజోగయ్య క్రేజీ కామెంట్స్ చేశారు. ‘ఆమ్మో.. ఈ పాట ఇప్పట్లో ఆగదు. చాలా దూరం వెళ్తుంది. చాలా కాలం మోగుతూనే ఉంటుంది’ అని పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది.