పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘OG’. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ మూవీ అప్డేట్ కోరుతూ.. ‘OG అప్డేట్ ఇచ్చి చావు’ అని పోస్ట్ పెట్టాడు. దీనిపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ స్పందించింది. ‘అప్డేట్స్ ఇవ్వకుండా చావునులే. ఉన్నప్పుడు ఇస్తా. ప్రస్తుతానికి సీజ్ ది షిప్’ అంటూ రిప్లై ఇచ్చింది.