పుష్ప సినిమాలో షికావత్ పాత్రలో ఎంతగానో ఆకట్టుకున్న మలయాళీ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఓ సినిమా చేసినందుకు తరువాత బాధపడ్డా అని అన్నారు. ‘మామన్నన్’ కథ నచ్చే ఒప్పుకున్నా కానీ ఆ తరువాత ఎందుకు నటించానా అని బాధపడ్డాను. ఎందుకంటే నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో తనది కుక్కలను క్రూరంగా చంపే పాత్ర అని తెర మీద చూసినప్పుడు తెలియకుండా కళ్లవెంట నీళ్లొచ్చాయన్నాడు.