బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘వార్ 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో ‘వార్ 3’కి లీడ్‌ను రివీల్ చేయనున్నట్లు సమాచారం. ‘వార్ 3’లో కన్నడ స్టార్ యష్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ‘వార్ 2’కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.