తమిళ హీరో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలోని స్పెషల్ సాంగ్‌ను నటి శ్రియా శరణ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. వీటిని నిజం చేస్తూ శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను సూర్య మూవీలో స్పెషల్ సాంగ్ చేశాను. గోవాలో తెరకెక్కిన ఈ పాట అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. డిసెంబర్లో దీన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు’ అని చెప్పారు.