MNCL: ఆస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తి పన్ను, నల్లా బకాయిలు మార్చి 31లోపు పూర్తిగా వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. పన్నులు చెల్లించని వారిపై తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.