HYD: పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో బోయిన్పల్లిలో ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దైనందిన ఆహారంలో ప్రోటీన్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడారు. గుడ్లు, చికెన్లో పుష్కలంగా లభించే ప్రోటీన్ శరీర నిర్మాణం, కండరాల బలానికి, రోగనిరోధక శక్తి పెంపుకు ఎంతో అవసరమని తెలిపారు.