జమ్మూకశ్మీర్ తొలిసారిగా రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవడంలో ఆ జట్టు బౌలర్ అఖిబ్ నబీ దార్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో 10 మ్యాచ్ల్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టాడు. క్వార్టర్, సెమీస్లో వరుసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఫైనల్లో కూడా 5 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును దక్కించుకున్నాడు.