NDL: ఆత్మకూరులో అంగన్వాడీ సెంటర్లకు మే నెల మొత్తం వేసవి సెలవులు ఇవ్వాలని ఇవాళ సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు 2019 నుంచి వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని కోరారు.