PLD: కోట నెమలిపురిలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేసవిలో వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి రోజుకు 3-4 లీటర్ల నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగొద్దని సూచించారు. శిబిరంలో స్థానికులకు పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.