SDPT: సిద్దిపేటలో ఈ నెల 17న నిర్వహించనున్న ఏఐటీయూసీ నాలుగో జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బెజ్జంకిలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. కార్మికుల హక్కులు, సంక్షేమ పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతోందని పేర్కొంటూ, ప్రతి కార్మికుడు మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.