సత్యసాయి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. సత్యమ్మ గుడి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గోపురం వరకు సాగింది. రఘునాథ్ రెడ్డి ఉత్సాహంగా సైకిల్ తొక్కి అందరిలో స్ఫూర్తి నింపారు.