ప్రకాశం: సింగరాయకొండ హైవేపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రోడ్డు దాటుతున్న బైకును ఓ గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొని ఆగకుండా వెళ్ళిపోయింది. ఇది గమనించిన పోలీసులు ఆ వాహనాన్ని చేజ్ చేసి చాకచక్యంగా మద్దిపాడు వద్ద అడ్డుకున్నారు. అనంతరం డ్రైవర్ నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు SI సుధీర్ కుమార్ తెలిపారు.