SKLM: ఖరీఫ్ సీజన్ నాటికి వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా చివరి ఎకరా వరకు రైతులకు సాగునీరు అందిస్తామని వంశధార ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ రవీంద్ర బాబు అన్నారు. ఆయన గురువారం అధికారులతో కలిసి టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో కాలువ పనులను పరిశీలించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, రైతులకు పూర్తి స్థాయిలో నీటి వనరులు అందిస్తామని అన్నారు.