WGL: వరంగల్ కమిషనరేట్ పరిధిలో నేటి నుంచి 10 రోజుల పాటు గ్రామసభలు జరగనున్న నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు CP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. మొదటి రోజు 35 మండలాల్లో మొత్తం 206 గ్రామసభలు నిర్వహిస్తున్నారు. జనగామలో 76, వరంగల్ జిల్లాలో 77, హనుమకొండలో 53 సభలు జరుగుతున్నాయి. సభలు శాంతియుతంగా, సజావుగా జరిగేలా భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దించారు.