MNCL: సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ సూచించారు. గురువారం జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఆయన ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. రోజురోజుకు శాస్త్ర విజ్ఞానం మారుతుందని, దానికి అనుగుణంగా మోసాలు కూడా పెరుగుతున్నాయన్నారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ కాగితాలను వెంట ఉంచుకోవాలన్నారు.