ADB: అగ్నివీర్ పోస్టులకు ఎంపికైన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులను అదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. సాయి శివ, బౌనే అన్వేష్, సునీల్ సింగ్, సృజన్, ఇర్ఫాన్, వర్ధన్లకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ పార్థసారథి, క్రీడా సంఘాల ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.