MDK: గ్రామసభలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. రుద్రారంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్యంపై శ్రద్ధ పెట్టాలని, వ్యర్థాల నిర్వహణ రూల్స్-2026 పాటించాలన్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని కోరారు. అనంతరం స్వచ్ఛత పోస్టర్ ఆవిష్కరించారు.