GDWL: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సంఘం గద్వాల జిల్లా ప్రధాన కార్యదర్శి రేపల్లె దేవదాస్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేపు (శుక్రవారం) జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమ్యూనిటీ హాల్లో ఈ మహాసభలు జరగనున్నాయని, జిల్లాలోని వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.