SDPT: బెజ్జంకి మండల రైతులు వరి కోత తర్వాత పంట అవశేషాలను కాల్చవద్దని మండల వ్యవసాయాధికారి బి. సంతోష్ సూచించారు. వీటిని దహనం చేయడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి భూమి సారవంతత తగ్గుతుందని, దీనివల్ల పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. కాబట్టి పంట అవశేషాలను కాల్చకుండా, సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగించి నేల ఆరోగ్యాన్ని కాపాడాలని రైతులకు ఆయన పిలుపునిచ్చారు.