HNK: హనుమకొండ పట్టణంలోని RTA కార్యాలయానికి గురువారం వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులు, ఇతర వాహనాల ఫిట్నెస్ను MVI వెంకటరమణ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిట్నెస్ లేని వాహనాలకు అనుమతులు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.