కృష్ణా: వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో కోడూరు మండలం మందపాకల శివారు చింతకోళ్ల గ్రామ ప్రజలకు వేసవి నేపథ్యంలో ఎదురైన త్రాగునీటి సమస్య తీర్చేందుకు ట్యాంకరుతో త్రాగునీరు అందిస్తున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు గురువారం కోడూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు కోట రాంబాబు చింతకోళ్ల గ్రామ ప్రజలకు వాటర్ ట్యాంకరుతో ఎనిమిది వేల లీటర్ల తాగునీరు అందచేశారు.