SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు BTR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంద్రం తిరుపతి రెడ్డి ఉచిత చల్లని మజ్జిగ పంపిణీ చేపట్టారు. మండలానికి వచ్చే ప్రజలు, ప్రయాణికులకు మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమంలో యాళ్లకి శ్రీనివాస్, బాంగోని శ్రీనివాస్, గొడుగు రాకేశ్, గౌరవేణి శ్రీనివాస్, ముకేశ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.