గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రస్తుతం మళ్లీ ఫామ్లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇండోనేషియా ఓపెన్ తొలి రౌండ్లో సింధు విజయం సాధించడంతో, తాజాగా విడుదల చేసిన బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో టాప్-10లోకి దూసుకొచ్చింది. 2023 అక్టోబర్ తర్వాత ఆమె టాప్-10 లోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.