TG: మాజీ మంత్రి KTR అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాలేదని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణలో ఉన్నారా లేదా అని నిలదీశారు. కార్యకర్తలు సింహాల్లా మారాలని కేటీఆర్ అంటున్నారని.. శాంతి భద్రతలు లేకుండా చేయాలని చూస్తున్నారా అని మండిపడ్డారు. పుష్కర తెలంగాణ ముష్కరుల పాలైందన్నారు.