ELR: పోలవరం మండలం గూటాల గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు పోలీసులు చట్టాలపై అవగాహన కల్పించారు. గంజాయి, నాటు సారా, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల కలిగే తీవ్ర నష్టాలను వివరించారు. ఎటువంటి సైబర్ మోసానికైనా గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ను ఆశ్రయించాలని సూచించారు.