GDWL: ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి అలంపూర్ మండలం సింగవరం-1 సర్పంచ్ గొంగోళ్ల ఈశ్వర్ గ్రామీణ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధులు అందకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, మౌలిక వసతులు దెబ్బతిన్నాయన్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.