NLG: దేవరకొండ ఆర్టీసీ డిపో నుంచి తాటికోల్ గ్రామానికి నూతనంగా ఏర్పాటు చేసిన బస్సును డిపో మేనేజర్ విజయకుమారి మంగళవారం ప్రారంభించారు. దేవరకొండ నుంచి ప్రతి రోజు సాయంత్రం 7గంటలకు దేవరకొండ నుంచి బయలుదేరుతుందని తెలిపారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు, తదితరులు పాల్గొన్నారు.