W.G: ఆకివీడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ కటారి జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం నామమాత్రంగా ముగిసింది. వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతి వివరాలను ఈ సమావేశంలో వెల్లడించారు. పలు శాఖల అధికారులు గైర్హాజరు కాగా, వచ్చిన వారు కూడా అంతంత మాత్రంగానే హాజరు కావడంతో సమావేశం వెలవెలబోయింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.