AP: ప్రముఖ హైపర్‌స్కేల్ డిజిటల్ ఇన్ఫ్రా సంస్థ ఎయిర్‌ట్రంక్ వ్యవస్థాపకుడు రాబిన్ ఖుదాతో CM చంద్రబాబు సమావేశమయ్యారు. VSPలో 2 గిగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై ఖుదాతో సంప్రదింపులు జరిపారు. డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్లో భాగస్వామ్య అవకాశాలపై విస్తృత స్థాయిలో తమ మధ్య చర్చ జరిగినట్లు చంద్రబాబు వివరించారు.