MDCL: గండిమైసమ్మలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.