TG: ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. జనసేన సభకు హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామిక ధోరణి అన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌కు ఇది నిదర్శనమని అభివర్ణించారు.కాంగ్రెస్ నిర్ణయాన్ని ఎన్డీయేగా మేం తప్పుబడుతున్నామని ఆయన పేర్కొన్నారు.