VZM: ప్రపంచ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా జిల్లాలో కౌంట్‌డౌన్ కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 10వ తేదీన రామనారాయణం వద్ద 500 మందితో, జూన్ 12వ తేదీన చింతపల్లి బీచ్ తీరాన సుమారు 500 మందితో యోగా ప్రదర్శనలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.