RR: ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొనగా వీరన్నగుట్టలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.