NRML: కడెం మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన బూఖ్య చిన్న రాము బైక్పై సోమవారం కూరగాయలు అమ్మడానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో రాము తనకు తీవ్ర గాయం కాగా నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాము మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.