ADB: ప్రతి ఒక్కరు చెట్లను నాటి రక్షించాలని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం నార్నూర్ మండలంలోని మాన్కపూర్ గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్థులకు చెట్లు పంపిణి చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న సందర్బంగా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అందరు కృషి చేయాలని పేర్కొన్నారు.