MDCL: అల్వాల్ పీఎస్ పరిధి గంగా ఎవెన్యూలో సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై కాలనీవాసులకు సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగం, మీ సురక్ష, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.