NDL: మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అవగాహన వర్క్‌షాప్‌లో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ పాల్గొన్నారు. ఓటరు జాబితాల ప్రక్షాళన, అర్హులైన ఓటర్ల నమోదు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంపుపై చర్చించారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలన్నారు.