TG: పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అభ్యంతరమేంటని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. రేవంత్ ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టరా అని, గతంలో కేసీఆర్ కూడా పక్క రాష్ట్రాల్లో సభలు పెట్టలేదా అని అడిగారు. ఏపీ డిప్యూటీ సీఎం సభ పెడితే కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని, ప్రజల ఆశీర్వాదం ఉన్నవారే అధికారంలో ఉంటారని ఆయన అన్నారు.