NLG: నార్కట్ పల్లి మండలం షాపల్లికి చెందిన గీత కార్మికుడు ఉడతల రోశయ్య మంగళవారం తాటి చెట్టు పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్గొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రోషయ్యను పరీక్షించిన వైద్యులు కాలు తొంటిలోకి విరిగిందని, చెయ్యి కూడా విరిగిందని తెలిపారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.