ASF: సిర్పూర్ (టీ) ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తిర్యాణి రేంజ్ నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ప్రజల సహకారంతో అటవీ రక్షణకు కృషి చేస్తామని తెలిపారు.