BDK: కొత్తగూడెం ప్రగతి మైదానంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల కలలు సాకారం అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.