ASR: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మంగళవారం ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఈమేరకు వైసీపీ ఆధ్వర్యంలో ఈనెల 4నుంచి 12వరకూ వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.